గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపాలిటీలో ఘనంగా దసరా సంబరాలు
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. రావణాసుర దహన కార్యక్రమం తర్వాత గ్రామస్తులు అలయ్ బలయ్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.