గండబోయినపల్లి టోల్ ప్లాజా భారీ టోల్ వసూళ్ల పై నేషనల్ హైవే అథారిటీ కి రాజంపేట పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి కి ఈ నెల 7వ తేదీన లేఖ రాసినట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ ఆఘా మోహియుద్దీన్ శనివారం సాయంత్రం తెలిపారు. ఈ లేఖలో ఎంపి వెంకట మిథున్ రెడ్డి ప్రస్తావిస్తూ..రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలో గత ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలన్నారు.