కోడుమూరు: కోడుమూరులో చేనేత మగ్గాలను పరిశీలించిన చేనేత కార్మిక సంఘం నాయకులు
కోడుమూరు పట్టణంలోని బీసీ కాలనీలో చేనేత మగ్గాల గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలతో నీళ్లు రావడంతో శనివారం చేనేత కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు వీరన్న మాట్లాడుతూ నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పూరి గుడిసెల్లోని నివసిస్తున్న వారికి గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, బ్యాంకు రుణాలు, నేతన్న నేస్తం రూ .36 వేలు అందించాలన్నారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.