ఆళ్లగడ్డ: గోవిందపల్లి మెట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి మెట్ట సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, రుద్రవరం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు,కామరాజనపల్లె రోడ్డు వైపు వెళ్తున్న పెద్ద సిద్దయ్య ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో పెద్ద సిద్ధయ్య తీవ్రంగా గాయపడ్డాడు,స్థానికులు వెంటనే స్పందించి అయనను ఆసుపత్రి కి తరలించారు, సమాచారం అందుకున్న సిరివెళ్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు