నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో "స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర "కార్యక్రమం
Nandyal Urban, Nandyal | May 16, 2026
నంద్యాల జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఎస్పీ సూచించారు.