ఒంగోలు అర్బన్: సోషల్ మీడియాలో నకిలీల పట్ల అప్రవత్తంగా ఉండాలని జిల్లా ప్రజలను హెచ్చరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 10, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో నకిలీల పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల ఫేస్బుక్ లో ప్రముఖుల పేరిట పోలీసుల పేరిట వ్యక్తులకు మెసేజ్ చేసి తమకు అత్యవసరంగా అవసరం ఉందని కొంత నగదు వేయాలని ఫోన్ పే నెంబరు మెసేజ్ రూపంలో పెట్టి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని ఇటువంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎవరు కూడా డబ్బులు వేయవద్దని ఎవరైనా సైబర్ నేరగాల బారిన పడి మోసపోతే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అంతేకాకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్ లో ఉంచుకోవాలన్నారు.