నంద్యాల అర్బన్: రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల లక్ష్యం :మహానందిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | May 15, 2026
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది నుంచి బోయలకుంట్ల మెట్ట వరకు రూ.7.90 కోట్లతో నిర్మించిన నూతన రహదారిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యమని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.3,000 కోట్లతో రహదారి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు.