దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్
దీపావళి పండుగ సందర్భంగా సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు కావడంతో జిల్లా పోలీసు ఆఫీస్లో కార్యక్రమం నిర్వహించలేదన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తిరిగి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది తదుపరి ప్రకటనలో వెల్లడిస్తామని తెలిపారు.