సంగారెడ్డి: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బీసీల సంక్షేమం కోసం తమ సంఘం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆర్ కృష్ణయ్య సభ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరం కావొద్దు అనుకుంటే 42 శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.