కడప: మాజీ MLA అంజాద్ బాషా CM చంద్రబాబుపై విమర్శలు
Kadapa, YSR | Sep 14, 2025 మాజీ MLA అంజాద్ బాషా CM చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఒక్క ఆసుపత్రి కట్టిన చరిత్ర అయినా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో చంద్రబాబు ముందుంటారని, రాష్ట్రంలో 6 వేల స్కూల్లు మూసివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పులివెందుల ప్రజలకు మెరుగైన వైద్యం అందకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.