జిల్లెల గ్రామంలో పర్యటించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామంలో మంగళవారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొని గ్రామంలోని స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే వెంట అవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి గ్రామ నాయకులు జిల్లెల్ల శంకర్ రెడ్డి వెంకట రామ సుబ్బారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు ఉన్నారు