జిన్నారం మున్సిపల్ కేంద్రంలో యాదవ సోదరుల ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రొయ్యపల్లికి చెందిన దున్నల యజమాని మధు యాదవ్ మాట్లాడుతూ, తాను గత 15 సంవత్సరాలుగా ఈ సదర్ సమ్మేళనంలో పాల్గొంటున్నానని తెలిపారు. హర్యానా రాష్ట్రం నుండి ప్రత్యేకంగా దున్నలను తెప్పించినట్లు ఆయన చెప్పారు. సమ్మేళనంలో దున్నపోతుల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.