నందికోట్కూరు: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా అరాచకాలు... వైసిపి ట్విట్
రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని వైసీపీ ధ్వజమెత్తింది. 'రుద్రవరం టోల్ ప్లాజా వద్ద తనను గుర్తించలేదన్న కోపంతో మహేష్ అనే ఉద్యోగిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బెదిరించారు. ఆయన ఆదేశాలతో అనుచరులు సదరు ఉద్యోగిని వాహనంలో బలవంతంగా ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యేపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి' అని వైసీసీ ట్వీట్ చేసింది.