జహీరాబాద్: మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి ఐడిఎస్ఎంటి కాలనీవాసుల ఆందోళన : అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. ఐడీఎస్ఎంటీలో నిర్మించుకున్న ఇండ్లను తమ భూమి అంటూ అక్రమార్కులు కూల్చివేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం మున్సిపల్ అధికారులు పట్టాలు పంపిణీ చేసిన ప్లాట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న మున్సిపల్, పోలీస్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.