రాయచోటిలో నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ధీరజ్
అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ సోమవారం రాయచోటి పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, ఏఎస్పీ మనోజ్ హేగ్దేవ్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఘన స్వాగతం పలికారు.తరువాత నూతన ఎస్పీ దంపతులు రాయచోటి వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో డివి రమణారెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా పోలీసు శాఖలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.