మిడ్జిల్: మిడ్జిల్ మండలంలో చోరీకి వెళ్లి విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి
దొంగతనానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి మిడ్జిల్ మండలంలో జరిగిది స్థానికులు తెలిపిన వివరాలు.. బోయిన్పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో యాజమాన్యం కంచెకు విద్యుత్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్సై మృతదేహలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.