నంద్యాల అర్బన్: నంద్యాలలో దొంగతనం చేసిన 48 గంటల్లో చేదించిన పోలీసులు, ముగ్గురు దొంగలు అరెస్ట్, రెండు బంగారు గాజులు స్వాధీనం
Nandyal Urban, Nandyal | May 1, 2026
నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 48 గంటల్లోనే చేదించారు శుక్రవారం నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లింగరాజు అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా చెడు అలవాట్లకు బానిసై డబ్బు కావాలని ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లలో రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు లింగరాజు తో పాటు చిట్యాల మస్తాన్ దూదేకుల కాజా ను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రెండు బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు