మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు జ్వరాలు
తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ పాఠశాలలో గత రెండు రోజులుగా దాదాపు 30 మంది విద్యార్థులు జ్వరతీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాల ప్రధాన ఆచార్యులు శ్రీనివాసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారని గురువారం చెప్పారు.