గుంతకల్లు: రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలి, గుత్తిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు
గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో రెన్యూ సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని వాటిని ఆపాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు కోసం రెన్యూ కంపెనీ భూసేకరణ చేస్తున్న బేతాపల్లి, ధర్మాపురం, బాచుపల్లి, కరిడికొండ, ఊటకల్లు, గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, పర్యటించారు. ఈ సందర్భంగా గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.