జిల్లా వ్యాప్తంగా వర్షాలపై ప్రజలకు హెచ్చరిక: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచనలు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం సూచించారు. వర్షం తీవ్రతను బట్టి చెరువులు, నదులు, వాగులను పోలీసులు ఎప్పటికప్పుడు సందర్శించాలని ఆయన ఆదేశించారు.చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తూ, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకే ప్రధాన ప్రాధాన్యం – ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్