ఒంగోలు అర్బన్: ఆరోగ్యభాగ్యానికి నిత్య యోగానే ఉత్తమ మార్గం : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 15, 2026
ఆరోగ్యభాగ్యానికి నిత్య యోగానే ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే యోగా సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగ సాధనలో భాగంగా సోమవారం కొత్తపట్నం మండలం పల్లెపాలెం బీచ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, పిడిసిసి బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ పంచభూతాల సంగమ ప్రాంతంలో ఉత్సాహంగా వారు యోగా సాధన చేశారు.