జహీరాబాద్: స్కూటీ డిక్కీలో నుండి పట్ట పగలు నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో స్కూటీ డిక్కీలో నుండి నగదు సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం మధ్యాహ్నం జహీరాబాద్ పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ వద్ద అంజయ్య అనే వ్యక్తి బ్యాంకులో నుండి డ్రా చేసిన మూడు లక్షల 17 వేల నగదు డిక్కీలో పెట్టుకొని నిలిపి ఉంచగా గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.