బనగానపల్లె: మృతదేహాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.
బనగానపల్లెలోని కొండపేట కాలనీకి చెందిన హత్యకు గురైన చిలకన్నగారి శ్రీరాములు మృతదేహాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం శ్రీరాముని మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా ఆయన అక్కడికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.