ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు,
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లల్లో గురువారం ఏసీబీ అధికారులు శోధాలు చేపట్టారు. ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టి 13 మంది అధికారుల ఇళ్లల్లో శోధాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు ప్రస్తుత సోదాలు నిర్వహిస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గతంలో చేపట్టిన విచారణలో భాగంగా నేడు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుండడంతో అధికారులలో ఆందోళన మొదలైంది.