మఖ్తల్: వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలి: బీఎస్పీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల వరి, పత్తి, వేరుశనగ వంటి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరెంట్ లేక, ఎరువులు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె.వి. నరసింహ అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతుల కష్టాలు వర్ణనాతీతమని ఆయన పేర్కొన్నారు