నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని బోడెమ్మనూరు గ్రామంలో స్మశానానికి రహదారి సౌకర్యం లేక ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, గ్రామంలో అందరికీ ఒకే స్మశాన వాటిక ఉండడంతో గ్రామంలో ఎవరు మరణించిన పొలాల్లో రస్తాలో శవాన్ని తీసుకొని వెళ్లి ఖననం చేస్తున్నారు, గ్రామస్తుల పొలాల్లో నుంచి స్మశానానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అధికారులు స్పందించి వెంటనే స్మశానానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు