భువనగిరి: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారు: కాంగ్రెస్ నాయకులు
భువనగిరి పట్టణ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ గత పదివేల పాలనలో సాధించిందేమీ లేదని విమర్శించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆయన కుమార్తె కుంభం కీర్తి రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.