నంద్యాల అర్బన్: మహానంది మండలంలో రైల్వే ట్రాక్ పై మహిళా మృతదేహం
Nandyal Urban, Nandyal | May 10, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలోని రైల్వే గేట్ వద్ద ట్రాక్పై ఓ మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. రైతులు ఉదయం పొలాలకు వెళ్తుండగా మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం నాగలక్ష్మి(70)గా గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.