అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:10 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో బయలుదేరి, ఉదయం 10:40 గంటలకు చినమండెం మండల హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికిన తరువాత దేవగుడిపల్లె గ్రామంలో గృహప్రవేశం, హౌస్ వార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 11:50 గంటలకు చినమండెం ప్రాజా వేదిక వద్ద జరిగే ప్రజా సమావేశంలో పాల్గొని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు పంపిణీ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.