జహీరాబాద్: ధనసిరి గ్రామంలో ప్రమాదవశత్తు ఇల్లు దగ్ధం
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధన సిరి గ్రామంలో ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి చెందిన కామ్రెడ్డి అనే రైతు చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెల్లరేగి పూర్తిగా సామాగ్రితో పాటు ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.