కనిగిరి: న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ మరియు ప్రముఖ న్యాయవాది అబ్దుల్ గఫార్ సూచించారు. కనిగిరి పట్టణంలోని మోడల్ స్కూల్ నందు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... కోర్టులో న్యాయవాదులను నియమించుకోలేని, ఆర్థిక స్తోమత లేని వారికి న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి వారి తరఫున వాదించేలా చూస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.