ఆళ్లగడ్డ: చింతకుంట గ్రామంలో భారీ చోరీ : బీరువా పగలగొట్టిబంగారం,కిలో వెండి లక్ష నగదు ఆపహరణ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని చింతకుంట లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది, వలి ఇంట్లోకి వెనుక వైపు నుంచి ప్రవేశించిన దుండగులు బీరువా పగలగొట్టి బంగారం, కిలో వెండి లక్ష రూపాయల నగదు ఆపహరించినట్లు బాధితుడు తెలిపాడు, ఇటీవల జరిగిన కుమార్తె వివాహానికి సంబంధించిన బంగారం కూడా బీరువాలోనే ఉన్నట్లు వాపోయారు, ఆళ్లగడ్డ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు