నర్సీపట్నం వైద్య కళాశాలను రద్దు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల18న గాంధీ విగ్రహం ఎదుట వైసీపీ శాంతి నిరసన
వైసిపి ప్రభుత్వం హయాంలో నర్సీపట్నంలో నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈనెల 18వ తేదీన పట్నంలోని గాంధీ విగ్రహం ఎదుట శాంతియుత ఆందోళన చేపట్టనున్నట్టు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు .ఈ మేరకు పోలీసులకు అనుమతి కోరుతూ దరఖాస్తు అందజేశామన్నారు