పలమనేరు: భారీ దొంగతనం కేసును చాకచక్యంగా చేజించిన పోలీసులు, నిందితుడు అరెస్ట్, 40 లక్షల నగలు స్వాధీనం - డీఎస్పీ ప్రభాకర్
పలమనేరు: పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 31.08.2025 తేదీ రాత్రి ఇంటిలో దొంగతనం జరుగగా దానిపై బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పలమనేరు ఇన్స్పెక్టర్ మురళీమోహన్ కేసు నమోదు చేశారు. మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిందితుడిని గుర్తించి, చిత్తూరు-బెంగళూరు హైవే పక్కన ఆంజనేయస్వామి గుడి వద్ద అడపాల వెంకట శివను అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుండి 40 లక్షల నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు.