ఒడిశా నుంచి దిగుమతిగా తీసుకొచ్చిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రభవన్, హుడా కాలనీ సమీపంలో ఎస్టీఎఫ్ సీ టీం దాడులు నిర్వహించింది. 6.300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒడిశాకు చెందిన బెహన్ దూరే, జగన్నాథ్ డాల్, సరోజ్ జలారి అనే ముగ్గురిని అరెస్ట్ చేసి సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.