నారాయణవనం మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి శోభారాణి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. ఎరువుల నాణ్యతను పరిశీలించుటకు నమూనాలను తీసి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ఎరువుల దుకాణం డీలర్లు రైతులకు ఎరువులను MRP ధరలకే విక్రయించాలని తెలియజేశారు. నారాయణవనంలోని టి.హరినాథ్, నటరాజ్ ఆగ్రో సర్వీస్ సెంటర్, పీఏసీఎస్, పాలమంగళంలోని శ్రీనివాస ఫెర్టిలైజర్స్ లను తనిఖీ చేసినట్లు తెలిపారు.