డోన్: బేతంచెర్లలో పాముకాటుతో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని ఝార్ఖండ్ కు తరలించేందుకు ఎదురుచూపులు
Dhone, Nandyal | Jun 10, 2026 బేతంచెర్ల మండలం రంగాపురం రహదారిపై ఉన్న ఓ ఫ్యాక్టరీలో జార్ఖండ్కు చెందిన సుకుర్ మునిగోప్ (19) అనే వివాహిత పాము కాటుతో మృతి చెందారు. వీరికి చిన్న కూతురు ఉంది. నిన్న రాత్రి నుంచి ముని మృతదేహం తోటి జార్ఖండ్ వాసులు ఆసుపత్రి ఎదుట ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఫ్యాక్టరీ ఓనర్ సహకారంతో మృతదేహాన్ని జార్ఖండ్కు తరలిస్తామని ముని భర్త గోషా గోప్ తెలిపారు.