రాజేంద్రనగర్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య
హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. మెదక్ జిల్లాకు చెందిన అనిల్ సామానగర్ లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరో యువకుడిని పెళ్లి చేసుకుందని తన పుస్తకంలో రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.