పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుంకీలతో ఒంటరి ఏనుగు కట్టడి, ప్రజలకు కీలక విషయాలు వెల్లడించిన సబ్ DFO
పలమనేరు: అటవీ శాఖ సబ్ డి ఎఫ్ ఓ వేణుగోపాల్ తెలిపిన సమాచారం మేరకు, పట్టణ పరిధిలో శనివారం ఓ ఒంటరి ఏనుగు హల్చల్ చేసిన ఘటన తెలిసిందే. ఈ ఏనుగు దాడిలో సుకుమార్ అనే అటవీశాఖ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకీలను రంగంలోకి దించాలని ఆదేశించడంతో, స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు రెండు కుంకీలను తీసుకొచ్చామన్నారు. ఒంటరి ఏనుగును తిరిగి పట్టణంలోకి రాకుండా కట్టడిచేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలు ఏనుగులను కట్టడి చేసేటప్పుడు చూడడానికి దయచేసి రావద్దని విన్నవించారు.