నందికోట్కూరు: పీరు సాహెబ్ పేట గ్రామంలో 83,450 సీజ్, 12 మందిపై కేసు నమోదు, మిడ్తూర్ ఎస్సై ఓబులేసు
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామం ఊరి బయట చింతపిచ్చలాట ఆడుతున్న అదే గ్రామానికి చెందిన 12 మంది ఆట ఆడుతుండగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి మిడుతూరు ఎస్సై ఓబులేష్ ఆట స్థలానికి చేరుకుని వారి వద్దనున్న 83,450 రూపాయలను స్వాధీనం చేసుకుని నగదును సీజ్ చేసినట్లు అదేవిధంగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఈ విధంగా డబ్బులతో ఆటలు ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,సిబ్బంది రేణు ప్రసాద్,మల్లికార్జున గౌడ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.