కరీంనగర్: జిల్లాలో 94 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి. శ్రీనివాస్ రావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలకు 15% దుకాణాలు గీత కార్మికులకు, 10% ఎస్సీ కేటగిరికి కేటాయించినట్లు తెలిపారు. మద్యం దుకాణాలకు 3 లక్షలు గా ఫీజు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నేటి నుంచి 18/10/2025 తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు స్వీకరించబడతాయని, 23/10/2025 రోజున జిల్లా కలెక్టరేట్ లో మద్యం షాపులో డ్రా తీయబడును అని తెలిపారు.