పలమనేరు: అక్రమ లేఅవుట్లు మరియు నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు
పలమనేరు: మున్సిపల్ కార్యాలయ వర్గాలు బుధవారం మీడియా తెలిపిన సమాచారం మేరకు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు, పలమనేరు పురపాలక సంఘ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు అలాగే గడ్డురు, బొమ్మిదొడ్డి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అనధికార కట్టడాలు మరియు లేఔట్లు గుర్తించి టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వాటిని నేడు తొలగించి హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.