కాప్రా జమ్మిగడ్డ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాప్రా జై జవాన్ కాలనీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన మరో ప్రమాదాన్ని చూసేందుకు వెళ్లుతున్న గోపగొని నందీశ్వర్ (15)ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.