కొత్తూరు మండల పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాలో ఉర్సు, గంధోత్సవం సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తును MLA వీర్లపల్లి శంకర్ ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పట్ల ఆయన పోలీసు శాఖను గురువారం అభినందించారు. ముఖ్యంగా డీసీపీ శిరీష నేతృత్వంలో బందోబస్తు చక్కగా నిర్వహించారని MLA సంతృప్తి వ్యక్తం చేశారు. lMLA కు డీసీపీ శిరీష తారసపడ్డారు. ఈ సందర్భంగా MLA ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ, శాంతియుత వాతావరణంలో ఉర్సు వేడుకలు నిర్వహించేందుకు పోలీసు శాఖ కృషి అభినందనీయమని పేర్కొన్నారు.