డోన్: రంగాపురం జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలంటూ బేతంచెర్ల తాసిల్దార్ కు వినతి పత్రం
Dhone, Nandyal | May 11, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురంలోని జగన్న లేఔట్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన PGRsలో వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా కాలనీకి సమీపంలో గ్రామానికి చెందిన డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల అక్కడ చెత్త వేస్తున్నారని తెలిపారు. దుర్వాసన వెదజల్లడమే కాకుండా చెత్తను అంటించడం వల్ల నిత్యం పొగ ఇళ్లలోకి వస్తూ శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు