నందికోట్కూరు: పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు: నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తీసుకుంటామని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు, మంగళవారం నందికొట్కూరు పట్టణంలోని సుబ్బారావు పేట కాలేజీ రోడ్డు సాయిబాబా పేట కేజీ రోడ్ లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు, అలాగే పట్టణంలోని వీధిలైట్లో మంచినీటి సరఫరాపై కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు, కాలనీలో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు