నాగులుప్పలపాడు: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈదుముడి గ్రామానికి చెందిన 12 సంవత్సరాల కటారి అనిల్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని చెరువులో పడి మృతి చెందాడు. సమాచారాన్ని తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని చెరువు నుండి వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.