అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె పట్టణంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జిలాని భాషా ,ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు గ్రంధాలయాలకు సందర్శించి పుస్తక పఠనాన్ని నాన అలవర్చుకోవాలని కోరారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థులకు జ్ఞానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.