అసిఫాబాద్: పాఠశాలలలో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో కెరమెరి, జైనూర్,సిర్పూర్ (యు), లింగాపూర్,తిర్యాణి జిల్లా పరిషత్,ఆశ్రమ పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులు,MEOలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల సముదాయం పరిధిలోని పాఠశాలలలో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థుల గైర్హాజరుపై ఉపాధ్యాయులతో సమీక్షించాలన్నారు.