పుంగనూరు: చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకుని వ్యక్తి మృతి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం 29ఏ చింతమాకులపల్లి గ్రామానికి చెంగప్ప చెందిన మునుస్వామి 65 సంవత్సరాలు శనివారం రాత్రి చేపల వేటకు గ్రామ సమీపంలో గల చెరువు వద్ద చేపల వేటకు వెళ్లి వల వేస్తుండగా వలలో చిక్కుకుని మృతి చెందాడు. మునుస్వామి కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం చెరువు వద్ద గాలించగా చెరువులో మునుస్వామి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన ఆదివారం ఉదయం 10 గంటలకు వెలుగులో వచ్చింది ఘటనపై చౌడేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.